Telugu Gateway
Politics

బాబూ అందరినీ ‘దేవాన్ష్’లాగా మార్చేయ్..ఓటమే ఉండదు

బాబూ అందరినీ ‘దేవాన్ష్’లాగా మార్చేయ్..ఓటమే ఉండదు
X

ప్రజల సొమ్ముతో పెన్షన్ ఇస్తూ..వైద్య సేవలు అందిస్తూ ఏపీ ప్రజలకు పెద్ద కొడుకునంటూ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబుబాబునాయుడు ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ యాడ్స్ టీవీల నిండా నిత్యం దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఏపీ ప్రజలకు పెద్ద కొడుకుగా ఉండటం కంటే..ఏపీ ప్రజల్లో కనీసం సగం మందిని అయినా సరే నారా దేవాన్ష్ లా మార్చేస్తే చంద్రబాబుకు అసలు ఎన్నికలు జరిగినంత కాలం ఓటమి అనేదే ఉండదు. ఎందుకంటే నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న నారా దేవాన్ష్ కు ఇప్పుడు ఏకంగా 16.17 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయట. ఏపీలోని ఆ వయస్సు పిల్లలకు చంద్రబాబు ఏమి చేసి అయినా సరే..దేవాన్ష్ ఆస్తుల్లో సగం కాకపోయినా పావు వంతు అయినా ఆస్తులు వచ్చేలా చేస్తే...మళ్ళీ దేవాన్ష్ ముఖ్యమంత్రి అయ్యేవరకూ ఏపీ ప్రజలు మీకే ఓటేస్తారు కదా?. ఆ టెక్నిక్ ఏదో కనిపెట్టి ప్రజల మీదకు వదిలేయండి. ప్రపంచంలోనే సంపద సృష్టించటంలో..సంపద పంచటంలో మీరే బెస్ట్ కదా. ఈ పని కూడా చేయండి. అప్పుడు మిమ్నల్ని మోడీ, కెసీఆర్, జగన్ కాదు కదా చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చినా కూడా ఏమీ చేయలేరు.

నారా దేవాన్ష్ ఆస్తుల సంపాదన స్కీమ్ ను అమలు చేస్తే ఒక్క దేవాన్ష్ ఏంటి?. దేవాన్ష్ పిల్లలు కూడా ఏపీలో కీలక పదవులు చేపట్టే ఛాన్స్ ఉంటుంది. ఓ సారి ఆ దిశగా చంద్రబాబు సీరియస్ గా ఆలోచన చేస్తే బాగుంటుందేమో. రెండేళ్ల వయస్సులోనే నారా దేవాన్స్ కు ఏకంగా 11 కోట్ల రూపాయల వరకూ ఆస్తులు వచ్చాయి. ఇప్పుడు అవి కాస్తా ఏకంగా 16 కోట్ల రూపాయలకు పెరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లకు ఆస్తులు అడ్డగోలుగా పెరిగాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వచ్చే ‘మార్గాలు ఎన్నో’. కానీ నారా దేవాన్స్ కూడా తాత తరహాలో దుమ్మురేపటమే విశేషం. మరి ఏపీ ప్రజలకు పెద్ద కొడుకుగా ఉంటారా?. లేక అందరినీ దేవాన్ష్ లాగా మార్చి అధికారాన్ని శాశ్వతం చేసుకుంటారో చూసుకోండి. నిర్ణయం మీదే. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఆస్తులు 20 కోట్లు అట. నాలుగేళ్ళ నారా దేవాన్స్ ఆస్తులు 16.17 కోట్ల రూపాయలు అట. కామెడీ అంటే ఇదే మరి.

Next Story
Share it