Telugu Gateway
Politics

ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలపై మోహన్ బాబు ధర్నా

ఫీజు రీఎంబర్స్ మెంట్  బకాయిలపై మోహన్ బాబు ధర్నా
X

ఏపీ సర్కారు తీరును ప్రముఖ నటుడు మోహన్ బాబు తప్పుపట్టారు. తమ విద్యాసంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి మోహన్‌బాబు.. ఆయన కుమారులు విష్ణు, మనోజ్ నిరసనకు దిగారు. మోహన్ బాబు భారీ నిరసనకు దిగనున్నారని సమాచారం రావడంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంటిని చుట్టుముట్టి.. హౌస్ అరెస్ట్ చేసేందుకు యత్నించారు. అయితే మోహన్‌బాబు వ్యూహాత్మకంగా తన విద్యాసంస్థ ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ చంద్రబాబు అంటే తనకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం చేశారు. అందర్నీ మోసం చేశారు. ఫీజులే చెల్లించని చంద్రబాబు ఇంకా యువతకు ఏమి ఉద్యోగాలు ఇస్తారు. మంచి చేసే ముఖ్యమంత్రులను ఎవరైనా అభిమానిస్తారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు. ఆ ముఖ్యమంత్రులు ఆ పథకాలు ప్రారంభిస్తే నేను ఎందుకు ఇవ్వాలని చెప్పు అప్రిషియేట్‌ చేస్తా.

నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఓటు వేస్తే నీచంగా మోసం చేశావు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు చెల్లించాలని లేఖ రాస్తే అంత పొగరా?, అహంకారామా?. పగలు, రాత్రిలా ....అమావాస్య, పౌర్ణమి ఎలా వస్తుందో... అలాగే చంద్రబాబు కాలం ఎల్లవేళలా మనది కాదు అది గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించారు మోహన్ బాబు. అన్ని కోట్లు సంపాదించిన నువ్వు రేపు ఏమవుతావో?. మనిషే శాశ్వతం కాదు...ఇంకా పదవి కూడా కాదనేది గుర్తు పెట్టుకో. బకాయిలుపై ఒకసారి చెప్పాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్‌ గురించి ఆలోచించేవాడు అయితే వెంటనే వాళ్ల ఫీజులు చెల్లించాలి. ఆయన చెప్పే హామీలన్నీ అసత్యాలు. అబద్దాలకోరు, అసత్యాలు మాట్లాడే చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే మంచి గుణపాఠం చెబుతారు అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it