Telugu Gateway
Cinema

షూటింగ్ లో ‘రోమాంటిక్’ హీరోయిన్

షూటింగ్ లో ‘రోమాంటిక్’ హీరోయిన్
X

కేతిక శర్మ. మోడల్. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాద్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న మూడవ సినిమానే ‘రొమాంటిక్’. ఈ సినిమాలో ఆకాష్ కు జోడీగా సందడి చేయనుంది కేతిక శర్మ. తాను దర్శకత్వం వహించిన సినిమాలు ఈ మధ్య ఎక్కడా హిట్స్ ఇవ్వకపోవటంతో అనిల్ పాడూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంత బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరీ. గోవాలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.

హీరోయిన్ కేతిక శర్మ కూడా తాజాగా షూటింగ్ లో జాయిన్ అయిపోయంది. ఆకాష్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు రెండు. ఆంధ్రా పోరి, మెహబూబాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టలేకపోయాయి. మరి ఈ మూడవ సినిమా ‘రొమాంటిక్’ అయినా ఆకాష్ ను ట్రాక్ లో పడేస్తుందా? లేదా అంటే వేచిచూడాల్సిందే. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. రొమాంటిక్ ను పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తున్నారు.

Next Story
Share it