Telugu Gateway
Politics

బీఎస్పీకి మూడు ఎంపీ,21 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన

బీఎస్పీకి మూడు ఎంపీ,21 అసెంబ్లీ సీట్లిచ్చిన జనసేన
X

ఏపీలో జనసేన-బీఎస్పీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆ పార్టీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించారు. చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ సీట్ల ఖరారు సమావేశంలో బిఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.

2008లోనే బీఎస్పీకి ఏపీ అధ్యక్షుడుగా ఉండాలని తనకు ఆహ్వానం అందింది, కానీ అప్పుడు కుదలేదన్నారు. అయితే ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న వామపక్షాలతో పొత్తు ఇఫ్పటి వరకూ ఓ కొలిక్కి రాలేదు కానీ..బిఎస్పీతో మాత్రం పొత్తు అలా కుదిరింది..సీట్ల కేటాయింపు కూడా ఇలా పూర్తయింది. మరి ఇంత వేగంగా ఈ పొత్తు వెనక మర్మం ఏమిటో రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. బిఎస్పీ అభ్యర్ధుల తరపున తాను ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Next Story
Share it