Telugu Gateway
Telangana

హెటెక్ సిటీ మార్గంలో ‘మెట్రో పరుగులు’

హెటెక్ సిటీ మార్గంలో ‘మెట్రో పరుగులు’
X

అత్యంత కీలకమైన ‘హైటెక్’ సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులు ప్రారంభించింది. బుధవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పచ్చ జెండా ఊపి ఈ సర్వీసులు ప్రారంభించారు. నిత్యం ఈ మార్గంలో లక్షలాది మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారనే విషయం తెలిసిందే. ఎల్బీనగర్-మియాపూర్ మార్గంతోపాటు హైటెక్ సిటీ రూట్ కూడా అత్యంత రద్దీగా ఉండే మార్గం అన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి పలు సార్లు వాయిదా పడిన ఈ మార్గ ప్రారంభోత్సవం..ఎట్టకేలకు పూర్తయింది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాజకీయ నేతలు ఎవరూ లేకుండానే గవర్నర్, సీఎస్ ల ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరిగింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10 కి.మీ. మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. హైటెక్‌సిటీకి మెట్రో పరుగుతో ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగులకు ట్రాఫిక్‌ చిక్కులు తప్పనున్నాయి. ప్రారంభంలో ఈ మార్గంలో నిత్యం లక్ష మంది రాకపోకలు సాగిస్తారని, మరికొన్ని రోజుల్లో రద్దీ రెండు లక్షల మార్కును దాటుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story
Share it