Telugu Gateway
Cinema

‘డియర్ కామ్రెడ్’లో విజయ్ లిప్ లాక్

‘డియర్ కామ్రెడ్’లో విజయ్ లిప్ లాక్
X

వాళ్లిద్దరూ ‘గీత గోవిందం’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇఫ్పుడు ‘డియర్ కామ్రెడ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన ‘లిప్ లాక్’ సీన్ ఉంది. వర్షంలో వీళ్ళిద్దరూ సన్నిహితం అయి ముద్దు పెట్టుకునే దృశ్యాలతో చిత్ర యూనిట్ సినిమా టీజర్ విడుదల చేసింది. టీజర్ లో ఓ ఫైటింగ్ సీన్..ఓ ముద్దు సీన్ తో విడుదల చేశారు. కాలేజీ లో విద్యార్ధి నాయకుడి పాత్రను హీరో విజయ్ పోషిస్తున్నట్లు సమాచారం.

భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్ట్‌ ఇన్‌ ప్రభాకరన్‌ సంగీతమందిస్తున్నారు. మే 31న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంటే సక్సెస్ ఫుల్ జంటతో కూడిన ఈ సినిమాను సమ్మర్ సందడిగా విడుదల చేయటం ద్వారా మంచి హిట్ కొట్టొచ్చనే ధీమాతో చిత్ర యూనిట్ ఉంది.

https://www.youtube.com/watch?time_continue=5&v=n3AqEHg6ofI

Next Story
Share it