Telugu Gateway
Politics

చంద్రబాబు దృష్టిలో ‘కొడుకు’ అంటే బ్రాండా?

చంద్రబాబు దృష్టిలో ‘కొడుకు’ అంటే బ్రాండా?
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కొడుకు’ అంటే బ్రాండా?. బ్రాండ్ కావటానికి కొడుకు ఏమైనా వస్తువా?. ఏ లెక్కలో నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి కొడుకు బ్రాండ్ అయితే కూతురు ఏంటి?. చంద్రబాబు దృష్టిలో అసలు కూతుళ్ళకే విలువే లేదా?. ఏ కోణంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వర్గాల్లో సైతం ఇఫ్పుడు ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గత కొంత కాలంగా చంద్రబాబు వ్యాఖ్యల్లో ‘బ్యాలెన్స్’ తప్పుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రధాని మోడీ విశాఖపట్నం సభలో చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చంద్రబాబు ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఆయన మాటల్లోనే..‘కుటుంబం అంటే మోడీకి ఏమి తెలుసు?. ఆయనకు కుటుంబం ఉంటే కదా?.భారత దేశం శక్తే కుటుంబ వ్యవస్థ.

వ్యవస్థ అయినా..సంస్థ అయినా..వ్యక్తులైనా సమర్ధత ఉంటేనే రాణిస్తారు. ఒక బ్రాండ్ ఒక సారి వస్తుంది. అదే బ్రాండ్ కొడుకు అసమర్ధుడు అయితే ..తర్వాతి తరంలో కొట్టుకుపోతుంది. న్యాయవాది, వైద్యుడు, సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఎవరైనా అంతే.’ ఇవీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అంటే కొడుకు బ్రాండ్ అయితే..మరి కూతురు ఏంటి?. సమాజంలో..కుటుంబ వ్యవస్థలో కూతుళ్ళకు అసలు గౌరవమే లేదా?. అంటే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలని..సినీ హీరో కొడుకు సినీ హీరో కావటమే కరెక్ట్ అని చంద్రబాబు ‘జస్టిఫికేషన్’ ఇవ్వదలచుకున్నారా?. ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన ఈ వివాదస్పద వ్యాఖ్యలు ఎన్ని మలుపులు తిరుగుతాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it