Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట..చంద్రబాబుపై డైరక్ట్ ఎటాక్

0

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సంచలనాలు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. వర్మ తాజాగా విడుదల చేసిన పాటలోని అంశాలు ఖచ్చితంగా టీడీపీని ఇరకాటంలోకి నెట్టేవే. ‘బతికుండగా గుండెనెంతో బాధపెట్టినా..పోయాక దండ వేసి దణ్ణం అవసరం’ అంటూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి దండలు వేస్తున్న విజువల్స్ తో ‘అవసరం’ అంటూ రెండవ పాటను విడుదల చేశారు. ఇప్పటికే తనదైన స్టైల్ సినిమాను ప్రమోట్ చేస్తున్న వర్మ తాజాగా రెండో వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు. వర్మ సినిమాలోని రెండో పాటలో ఎన్టీఆర్ పట్ల కుటుంబం ఎలా ప్రవర్తించిందన్న విషయాలను ప్రస్తావించాడు.

అవసరం అవసరం అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ విజయాలు సాధించినప్పుడు ఆయన వెంట నడిచిన కుటుంబం, బంధువులు ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఒంటరిని చేశారో ప్రస్తావించాడు. అయితే పాట మొత్తం సినిమాలోని పాత్రధారులను మాత్రమే చూపించిన చంద్రబాబు ను మాత్రం డైరెక్ట్‌ గా చూపించాడు. కల్యాణ్ మాళిక్ సంగీత సారధ్యంలో విల్సన్‌ హెరాల్డ్ ఆలపించిన ఈ పాటకు సిరా శ్రీ సాహిత్యమందించారు. ఈ శుక్రవారం నాడు వర్మ సినిమాకు సంబంధించి రెండో థియేట్రికల్‌ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

- Advertisement -

 

Leave A Reply

Your email address will not be published.