Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నటి శ్రీరెడ్డిపై దాడి

0

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేయటం ద్వారా శ్రీరెడ్డి పాపులర్ అయ్యారు. అప్పటివరకూ ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే యువతులను  కొంత మంది నిర్మాతలు..హీరోలు లొంగదీసుకుంటున్నారని..అలా లొంగిపోయిన వారికే అవకాశాలు ఇస్తున్నారంటూ పెద్ద దుమారమే రేపారు. కొన్ని రోజుల పాటు దీనిపై నానా హంగామా జరిగింది. ఎప్పటిలాగానే తర్వాత అందరూ దీన్ని మర్చిపోయారు. ప్రస్తుతం చెన్నయ్ లో ఉంటున్న నటి శ్రీరెడ్డిపై  ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. నటి శ్రీరెడ్డితోపాటు ఆమె మేనేజర్ మోహన్ పై కూడా ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి కేసులో పోలీసులు  ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. చెన్నై వలసరవాక్కంలో నటి శ్రీరెడ్డి నివాసం ఉంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్‌ మోహన్‌పై దాడి చేశారు.

- Advertisement -

దీనిపై ఆమె వెంటనే కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో గొడవ పడుతున్న ఫైనాన్షియర్, సినీ నిర్మాత సుబ్రమణి (40), అతని అక్క కుమారుడు గోపి (23)లను అరెస్ట్‌ చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శ్రీరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నయ్  కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు నిర్మాత సుబ్రమణి మూడునెలల క్రితం హైదరాబాద్‌లో శ్రీరెడ్డిని లైంగిక వేధింపులకు గురిచేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ పోలీసులు సుబ్రమణిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సుబ్రమణి తన అక్క కుమారుడు గోపీని వెంటబెట్టుకుని వచ్చి శ్రీరెడ్డిపై దాడికి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు శ్రీరెడ్డిని విచారిస్తున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.