Telugu Gateway
Politics

ఏపీ అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికల తేదీలు తేలేది నేడే

ఏపీ అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికల తేదీలు తేలేది నేడే
X

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ కు ముహుర్తం కుదిరింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్ సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనుంది. దీంతో అసలు ఆట ప్రారంభం కానుంది. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడికానుంది. ఇఫ్పటికే దేశమంతటా రాజకీయ వేడి పెరిగింది. ప్రధాన పార్టీలు ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత స్పీడ్ అందుకోనుంది.

వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ వారం రోజుల కిందటే వెలువడాల్సి ఉన్నా ప్రధాని నరేంద్రమోడీ కార్యక్రమాల కోసమే షెడ్యూల్ ను వాయిదా వేస్తూ వచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే సీఈసీ మాత్రం ఈ విమర్శలను తిప్పికొట్టింది. తమ షెడ్యూల్ ప్రకటనకు ప్రధాని పర్యటలకు సంబంధంలేదని వ్యాఖ్యానించింది. అయితే ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలు అన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు అది కూడా ఆదివారం నాడు సీఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయనుండటం విశేషం. షెడ్యూల్ వెల్లడి కోసం సీఈసీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

Next Story
Share it