Telugu Gateway
Cinema

నలుగురు భామలతో విజయ్ రొమాన్స్!

నలుగురు భామలతో విజయ్ రొమాన్స్!
X

ఒక్క సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటేనే ఎక్కువ. కానీ ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్లు. మరి ఆ హీరో ఎవరో తెలుసా?. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ. ఆయన కొత్త సినిమా కోసం నలుగురు హీరోయిన్లను ఎంపిక చేశారు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో చేరిన భామ క్యాథరిన్ థ్రెసా.

ఇప్పటికే విజయ్ కు జోడీగా రాశీఖన్నా, ఇసబెల్ లీత్, ఐశ్వర్య రాజేష్ లు ఉన్నారు. వీరికి తోడు క్యాథిరన్ కూడా వచ్చేసింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో ఈ భామలు అందరూ సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లాలో జరుగుతోంది.

Next Story
Share it