Telugu Gateway
Cinema

‘ఫోర్బ్స్’ జాబితాలో విజయ్ దేవరకొండ

‘ఫోర్బ్స్’ జాబితాలో విజయ్ దేవరకొండ
X

టాలీవుడ్ సంచలనం విజయ దేవరకొండ మరో విజయాన్ని అందుకున్నారు. ఆయన ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఆయా రంగాల్లో సాధించిన సక్సెస్ లు..ప్రగతిని గుర్తించి ఈ జాబితా సిద్ధం చేస్తారు. టాలీవుడ్ కు సంబంధించి ఇందులో విజయ్ కు చోటు దక్కింది. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నది విజయ్ ఒక్కరే. విజయ్ టాలీవుడ్ లోకి ప్రవేశించింది 2011లోనే అయినా..ఆయనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది మాత్రం పెళ్ళిచూపులు..అర్జున్ రెడ్డి సినిమానే అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇదే జాబితాలో ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంథాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్ లు కూడా ఉన్నారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన 30 ఏళ్ల లోపు వారి జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది.

‘ఫోర్బ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ' పేరుతో ఆరవ జాబితాను సంస‍్థ విడుదలైంది. వయస్సు 25 అయినా 52 అయినా సక్సెస్‌లను అభినందించడంతోపాటు, తక్కువ వయస్సులోనే విజయాలను అందుకున్నవారి ప్రతిభ, ధైర్యాన్ని గుర్తించడమే తమ లక్ష్యమని ఫోర్బ్స్‌ ఇండియా వెల్లడించింది. విజయాలు, కెరీర్‌లో దూసుకెళ్లే తత్వం, తమ వ్యాపారాన్ని నిర్వహించే సత్తా, దీర్ఘకాలం ప్రతిభను కొనసాగించే సామర్థ్యం ఆధారంగా ఈ జాబితాను రూపొందించామనీ , దీనికి సంబంధించిన కథనాన్ని ఫిబ్రవరి 15, ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజీన్‌లో చూడొచ్చని తెలిపింది.

Next Story
Share it