Telugu Gateway
Politics

తిరుపతి విమానాశ్రయం విస్తరణ

తిరుపతి విమానాశ్రయం విస్తరణ
X

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో విమానాశ్రయాల విస్తరణ పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. తాజాగా విశాఖపట్నం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ పనులకు ఢిల్లీ నుంచే శంకుస్థాపన చేసిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు తాజాగా తిరుపతి విమానాశ్రయ రన్ వే విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రన్ వే విస్తరణ పనులకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. 177 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రన్ వేను 2286 మీటర్ల నుంచి 3810 మీటర్ల వరకూ పెంచనున్నారు.

దీంతో బోయింగ్ విమానాలు కూడా ల్యాండ్ అయ్యే వెసులుబాటు లభించనుంది. ఇప్పటికే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించిన సంగతి తెలిసిందే. ఈ పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనుల విషయంలో కలసి ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు.ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Next Story
Share it