Telugu Gateway
Politics

తెలంగాణలో కొత్త జిల్లాలు 33

తెలంగాణలో కొత్త జిల్లాలు 33
X

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య మరింత పెరిగింది. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెండు కొత్త జిల్లాలు కూడా వచ్చి చేరాయి. అవే ములుగు, నారాయణపేట. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31 నుంచి 33కి పెరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఫైల్‌ పీఎంవో కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. న్యాయశాఖ అభిప్రాయం తీసుకున్నాక, జిల్లాల ఏర్పాటుపై అధికారికంగా నోటిఫికేషన్ వెలువడించే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క - సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్‌ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది. అప్పటికే 2016, అక్టోబర్‌ 11న కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటయ్యాయి. నోటిఫికేషన్ జారీ చేయటం ఇక కేవలం లాంఛనమే.

Next Story
Share it