Telugu Gateway
Cinema

సాయిపల్లవి సంచలన నిర్ణయం

సాయిపల్లవి సంచలన నిర్ణయం
X

ఆమె పేరుకు యూత్ ‘ఫిదా’ అయిపోతారు. మళయాళ సినిమా ప్రేమమ్ సినిమాలో ‘డ్యాన్స్’తో దుమ్మురేపిన ఈ భామ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె యూత్ కు బాగా దగ్గరయ్యారు. అంతే కాదు..తేడాగా ప్రవర్తించే హీరోల విషయంలోనూ ఆమె అంతే తేడాగా ఉంటారు. ఏ మాత్రం రాజీపడరు. తాజాగా ఆమె పెళ్ళిపై మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించి అభిమానులను షాక్ కు గురిచేశారు. పెళ్ళిపై తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పింది ఈ భామ.

జీవితాంతం ఇలాగే ఉంటూ తన తల్లి దండ్రుల బాగోగులను చూసుకోవాలని భావిస్తున్నట్టుగా ప్రకటించింది. ఆమె నిర్ణయం విన్న అభిమానులు షాక్ కు గురయ్యారు. తాజాగా మారి 2 తో ఆకట్టుకున్న ఈ భామ త్వరలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగులో రానా దగ్గుబాటి సరసన ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. సాయిపల్లవిని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి.

Next Story
Share it