Telugu Gateway
Top Stories

పుల్వామా దాడికి ప్రతీకారం

పుల్వామా దాడికి ప్రతీకారం
X

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందా?. అంటే ఔననే సంకేతాలే వస్తున్నాయి. పుల్వామాలో జరిగిన దాడిలో భారత్ కు చెందిన 43 మంది జవాన్ల వీరమరణానికి కారణం అయిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీని భారత భద్రతా దళగాలు మట్టుబెట్టాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన అదిల్ దారుకు శిక్షణ ఇఛ్చింది కూడా రషీదే అని సమాచారం. రషీద్ తోపాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్‌ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తద్వారా సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే వీరిద్దరిని హతమార్చి దీటైన సమాధానం ఇచ్చింది.

ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఆర్మీ మేజర్, ముగ్గరు జవాన్లు, ఓ పౌరుడు మృత్యువాత పడ్డారు. పుల్వామాలోని పింగ్లన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. మృతి చెందిన జవాన్లు 55 రాష్ట్రీయ రైఫిల్స్‌ దళానికి చెందిన వారు.

Next Story
Share it