Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చిక్కుల్లో రాహుల్ గాంధీ

0

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. గతంలో చేసిన ట్వీట్లు..చెప్పిన మాటలు పలు పార్టీల నేతలను వెంటాడుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ కు అదే పరిస్థితి ఎదురైంది. వీటిని ఆసరా చేసుకుని బిజెపి రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన  శారదా చిట్ ఫండ్ స్కామ్ లో 20 లక్షల మంది తమ డబ్బును నష్టపోయారని..మమతా బెనర్జీ అవినీతిని అంతమొందిస్తామని చెప్పారని కానీ బెంగాల్ ను లూటీ చేసినవారిని రక్షిస్తున్నారని గతంలో ట్వీట్లు చేశారు. దేశంలోని ఇది అతి పెద్ద స్కాం అని దీనిపై మమతా చేసిందేమీ లేదంటూ పేర్కొన్నారు. ఇప్పుడు సీబీఐ అధికారులు శారదా స్కామ్ పై పోలీసు కమిషనర్ ను విచారించేందుకు వెళ్ళగా ఏకంగా బెంగాల్ పోలీసులు సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకోవటం..సీఎం మమతా బెనర్జీ ఇది బెంగాల్ పై దాడి అంటూ దీక్షకు కూర్చోవటం తెలిసిందే.

- Advertisement -

మమతా దీక్షకు రాహుల్ గాంధీతోపాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలువురు నేతలు మద్దతు ప్రకటించారు. రాహుల్ గాంధీ  చేసిన పాత ట్వీట్లనే బయటకు తీసి బిజెపి ఎటాక్ ప్రారంభించింది. రాహుల్ పాత ట్వీట్లను..ప్రస్తుతం మమతాకు మద్దతు ఇస్తున్న రాహుల్ చర్యలను ఎత్తిచూపుతూ ‘మల్టిపుల్ డిజార్డర్ ’తో బాధపడుతున్న రాహుల్ త్వరగా కోలుకకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బిజెపి ట్వీట్ లో ఎటాక్ చేసింది. ఈ వ్యాధితో బాధపడేవారు గతంలో జరిగిన విషయాలను గుర్తుంచుకోవటంలో ఇబ్బంది పడతారు అంటూ ఎద్దేవా చేసింది. పశ్చిమ బెంగాల్ వ్యవహారం ఇఫ్పుడు దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది.

 

 

Leave A Reply

Your email address will not be published.