Telugu Gateway
Politics

చంద్రబాబు కుప్పం సీటు...పోటీకి పవన్ దరఖాస్తు

చంద్రబాబు కుప్పం సీటు...పోటీకి పవన్ దరఖాస్తు
X

అసలు ఈ పోలిక ఏంటి?. కుప్పం సీటుకు పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేయటం ఏమిటి అనుకుంటున్నారా?. అది కాదు అసలు సంగతి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబునాయుడి మోడల్ ను ఎలా ఫాలో అవుతున్నారో చూడండి. ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి సీట్ల ఖరారు తీరే వెరైటీగా ఉంటుంది. పక్కాగా ఇచ్చే సీట్లు..వాళ్ళు తప్ప అక్కడ అభ్యర్ధులెవరూ లేరని తెలిసినా సరే..అభ్యర్ధుల జాబితాలను అర్థరాత్రులే ప్రకటిస్తారు. చివరకు చంద్రబాబుకు చెందిన ‘కుప్పం సీటు’ అయినా సరే ..పేరు అర్థరాత్ర బయటకు రావాల్సిందే. అన్నీ పొలిట్ బ్యూరో ఆమోదముద్ర వేసిందనే చెబుతారు. పేరుకు పొలిట్ బ్యూరో అని చెప్పినా సీట్లను ఎవరు..ఎట్లా ఖరారు చేస్తారో టీటీపీ నేతలకు..ఆ వ్యవహారాలు చూసే వాళ్ళందరికీ తెలుసు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు ఇఛ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే ఆయన కూడా సీటు కోసం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీకి దరఖాస్తు చేసుకున్నారట. కమిటీ ఖరారు చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ పోటీచేయరా?. ప్రాంతీయ పార్టీల్లో సీట్ల ఖరారు...సీట్ల కేటాయింపు ఎవరు చేస్తారో తెలియని ఓటర్లు ఉన్నారా?.

ఏ రాజకీయ వ్యవహారాల కమిటీ ఖరారు చేసిందని ఇఫ్పటికే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో జనసేన తరపున పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించేశారు. అసలు ధరఖాస్తులే తీసుకోవటం పూర్తి కాకుండానే అభ్యర్ధుల పేర్లు ఎలా పవన్ ప్రకటించారు. వాళ్ళ పేర్లను ప్రకటించిన పవన్ తాను సీటు కోసం దరఖాస్తు చేసుకోవటం ఏమిటి?? ఇది ఎవరిని మభ్యపెట్టడానికి. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు కుప్పం సీటును టీడీపీ పొలిట్ బ్యూరో ఓకే చేసిందని చెపితే వినటానికి ఎలా ఉంటుందో...పవన్ కళ్యాణ్ కూడా పోటీకి ఆసక్తిచూపుతున్నారని..ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారని చెప్పటం కూడా అలాగే ఉంది. చంద్రబాబుతో సహవాసం చేయటం వల్లో ఏమో కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ప్రచారాల విషయంలో ఆయన బాటలోనే వెళుతున్నట్లు కన్పిస్తోంది.

Next Story
Share it