Telugu Gateway
Top Stories

పాక్ పెద్ద తప్పు చేసింది

పాక్ పెద్ద తప్పు చేసింది
X

సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని భారత్ సీరియస్ గా తీసుకుంది. ఈ దాడికి ప్రతిగా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. అంతే కాదు..కాశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడిన వారికి దీటైన సమాధానం చెబుతామని మోడీ హెచ్చరించారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలే​కరులతో మాట్లాడుతూ... పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు. ఇలాంటి దాడులతో భారతదేశ సమగ్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదులపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.130 కోట్ల మంత్రి ప్రజలు ధీటైన జవాబిస్తారని పేర్కొన్నారు.భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు మోడీ స్పష్టం చేశారు.

ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి రావాలన్నారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామన్నారు. సైనికుల ధైర్యం, త్యాగాలు వెలకట్టలేనివని అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసాయిచ్చారు. దిలా ఉంటే పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ ఉపసంహరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక పాకిస్తాన్, ఆ దేశ మద్ధతుదారుల హస్తం ఉందని ఆరోపించారు.

Next Story
Share it