Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

నాని కొత్త సినిమా రెడీ

0

వరస హిట్లకు కొంత బ్రేక్ వచ్చినా..నాని మాత్రం వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ హీరో కొత్త సినిమా ‘జెర్సీ’ విడుదలకు రెడీ అవుతోంది. అంతే కాదు..ప్రేమికుల దినోత్సవం రోజున సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాధ్ నటించారు.  ‘మళ్ళీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -

క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. వాలంటైన్స్ డే రోజున  ‘‘అదేంటోగానీ ఉన్న పాటుగా’ అంటూ సాగే సాంగ్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. 14 నుంచి పాటలోని మ్యాజిక్‌ని ఫీల్‌ అవ్వండి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.