Telugu Gateway
Andhra Pradesh

అద్దె జనాలతో రాష్ట్రంపై మోడీ దాడి

అద్దె జనాలతో రాష్ట్రంపై మోడీ దాడి
X

కేంద్రం అన్ని విషయాలో విభజిత ఏపీకి అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఢిల్లీలో దీక్ష ప్రారంభించిన చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రజలు ప్రధాని మోడీని ఏ మాత్రం క్షమించరని అన్నారు. మూడు రోజులు గడువు ఇస్తున్నా.పార్లమెంట్ వేదికగా ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము హక్కుల కోసమే పోరాడుతున్నాం తప్ప..ఏదో బిక్ష కోసం కాదని వ్యాఖ్యానించారు. గతంలో ఏ ప్రభుత్వం చూపని రీతిలో మోడీ సర్కారు ఏపీపై వివక్ష చూపిందని వ్యాఖ్యానించారు. విభజన సమయంలో ఇఛ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు. గతంలో బిజెపినే విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని..వెంకయ్యనాయుడు పదేళ్ళు ప్రత్యేక హోదా ఉండాలని చేసిన డిమాండ్ ను గుర్తుచేశారు. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు, పోలవరం డీపీఆర్ ఆమోదం అన్నీ పెండింగ్ లోనే పెట్టుకుకూర్చున్నారని ధ్వజమెత్తారు.

రాజధాని నిర్మాణానికి నిధులు కూడా ఇవ్వలేదన్నారు. మోడీ సర్కారు ఆటలు సాగవని చెప్పేందుకు ఢిల్లీకి వచ్చానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇది హక్కుల కోసం పోరాటం అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఎవరికైనా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఏపీ భవన్ వేదికగా చేసిన ఉద్యమాలు ఎన్నో సక్సెస్ అయ్యాయని..తమ దీక్ష కూడా విజయవంతం అవుతుందని అన్నారు. అద్దె జనాలను పెట్టుకుని మోడీ రాష్ట్రంపై దాడి చేశారని వ్యాఖ్యనించారు. ఏపీ చరిత్రలో బిజెపి అడ్రస్ లేకుండా పోతుందని ధ్వజమెత్తారు. తాము లెక్కలు చెప్పటానికి సిద్ధంగా ఉన్నామని..అయితే రాష్ట్రం కట్టిన పన్నులకు కేంద్రం లెక్కలు చెబుతుందా? అని ప్రశ్నించారు.

Next Story
Share it