‘మజిలీ’ టీజర్ వచ్చేసింది
పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య..సమంత లు కలసి నటిస్తున్న సినిమానే ‘మజిలీ’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో సమంతకు తోడు మరో భామ కూడా ఉంది. ఆమే దివ్యాన్ష కౌషిక్. ‘నీకు ఓ సంవత్సరం టైం ఇస్తున్నా..సచిన్ అవుతావో..సోంబారు అవుతావో అంటూ రావు రమేష్ వాయిస్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. టీజర్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న నాగచైతన్య ను..ఆ తర్వాత దివ్యాన్షతో చైతన్య రొమాంటిక్ సీన్లు ఉన్నాయి.
టీజర్ చివర్లో పోసాని కృష్ణమురళీ ‘వెధవలకెప్పుడూ మంచి పెళ్లాలే దొరకుకుతారు’ అంటూ చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ.
https://www.youtube.com/watch?v=AZCJEgCH5Pk