Telugu Gateway
Cinema

‘లవర్స్ డే’ మూవీ రివ్యూ

‘లవర్స్ డే’ మూవీ రివ్యూ
X

ఒక్క సీన్ ఆ అమ్మాయిని ఒక్కసారిగా దేశంలోనే పాపులర్ చేసింది. కన్నుగీటుతో యువత మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ యువతి గురించి ప్రస్తుతం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆమే ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను గీటుతో..ప్రేమ తుపాకీ పేల్చటంతో పాపులర్ అయిన ఈ భామ నటించిన ఒరు అదర్ లవ్ మళయాళ సినిమా తెలుగులో లవర్స్ డేగా వాలంటైన్స్ డే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రేక్షకుల్లో ప్రియా వారియర్ తన సన్నివేశాలతో ఎన్నో అంచనాలు రేపారు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఇది ఇంటర్మీడియ్ విద్యార్ధుల ప్రేమ కథ. సహజంగా ఏ ప్రేమ కథ అయినా కొంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే యూత్ ను ఆకట్టుకుంటుంది. కానీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘లవర్స్ డే’ సినిమాలో ఏ మాత్రం జీవంలేదనే చెప్పొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే పాపులర్ అయిన సన్నివేశాలు మినహా సినిమాలో ప్రియా పాత్ర గురించి చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. ఆమె నటన కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రియాతో పోలిస్తే హీరో రోషన్ కు తొలుత ఫ్రెండ్ గా..సెకండాఫ్ లో ప్రేయసిగా నటించిన నూరిన్ షరీఫ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరో రోషన్ ఫ్రెండ్ గా నటించిన సియాద్ షాజహన్ సినిమాలో అప్పుడప్పుడు నవ్వులు పూయించాడు. దర్శకుడు ఒమర్ లూలూ ప్రియా ప్రకాష్ వారియర్ ద్వారా సినిమాపై వచ్చిన హైప్ ను వాడుకుని యూత్ ను ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించటంలో విఫలమయ్యారు. ఓవరాల్ గా చూస్తే ఏ మాత్రం ‘ఫీల్’ లేని ప్రేమ కథగా ‘లవర్స్ డే’ మిగిలిపోనుంది.

రేటింగ్. 1.75/5

Next Story
Share it