Telugu Gateway
Telangana

కెసీఆరే ‘సర్కార్’

కెసీఆరే ‘సర్కార్’
X

కెసీఆర్ అంటే సర్కారు..సర్కార్ అంటే కెసీఆర్. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక రెండు నెలల తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా పది మందికి మంత్రి పదవులు వచ్చాయి. అయినా సరే అత్యంత కీలకమైన ఆర్థిక, సాగునీటి, రెవెన్యూ, మునిసిపల్, ఐటి, పరిశ్రమలు, విద్యుత్ శాఖలు కెసీఆర్ చేతిలోనే ఉన్నాయి. ఈ శాఖల ప్రాధాన్యత ఏంటో అందరికీ తెలిసిందే. గతంలో మంత్రి హరీష్ రావు నిర్వహించిన అత్యంత కీలకమైన సాగునీటి శాఖను కెసీఆర్ తన వద్దే పెట్టుకున్నారు. కెటీఆర్ నిర్వహించిన మునిసిపల్, ఐటి, పరిశ్రమల శాఖలు కూడా ‘బయట’కు పోకుండా అట్టిపెట్టారు. ముఖ్యమంత్రికి ప్రతి శాఖలో జోక్యం చేసుకునే అధికారం ఉన్నా కూడా..సీఎం కెసీఆర్ తన దగ్గర అత్యంత కీలకమైన శాఖలు అట్టిపెట్టుకోవటం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల్లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఇంద్రకరణ్‌ రెడ్డిలకు గతంలో కేటాయించిన శాఖల బాధ్యతలు అప్పగించగా.. మిగిలిన వారి శాఖలను మార్చారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖను నిర్వహించిన ఈటల రాజేందర్‌కు వైద్య, ఆరోగ్య శాఖను, జి.జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను అప్పగించారు.

గత ప్రభుత్వంలో టి.పద్మారావుగౌడ్‌ నిర్వహించిన ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖలను.. అదే వర్గానికి చెందిన వి.శ్రీనివాస్‌గౌడ్‌కు, జూపల్లి కృష్ణారావు నిర్వహించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అదే వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ముఖ్యమంత్రి కేటాయించారు. రవాణా శాఖను అదే వర్గానికి చెందిన వేముల ప్రశాంత్‌రెడ్డికి, గత ప్రభుత్వంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన వ్యవసాయ శాఖను అదే వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డికి కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగు రామన్న నిర్వహించిన అటవీ, పర్యావరణ శాఖలను.. అదే జిల్లాకు చెందిన ఇంద్రకరణ్‌ రెడ్డికి అప్పగించారు. కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖ బాధ్యతలను తన సన్నిహితుడైన వేముల ప్రశాంత్‌రెడ్డికే కేసీఆర్‌ కేటాయించారు.

Next Story
Share it