Telugu Gateway
Politics

భారత్ లో హై అలర్ట్

భారత్ లో హై అలర్ట్
X

పాక్ లోని ఉగ్రవాద క్యాంపులపై భారత దేశానికి యుద్ధ విమానాలు చేసిన మెరుపుదాడి తర్వాత దేశమంతటా హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రాలతోపాటు..అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ 2 తర్వాత ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన రక్షణ వ్యవహారాల మంత్రిత్వ కమిటీ (సీసీఎస్) సమావేశం అయి పరిస్థితిని మదింపు చేసింది. ఈ సమావేశంలో హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్, ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్టీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశం తర్వాత చకచకా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వైమానిక దళం చేసిన మెరుపు దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు సెలవులను రద్దు చేసింది. ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో భారత తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దీంతో తీర ప్రాంతాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ 2పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. దాడులను విజయవంతంగా పూర్తి చేసిన వైమానిక దళాన్ని అభినందించారు.

Next Story
Share it