Telugu Gateway
Politics

‘అన్నదాత సుఖీభవ’తో చంద్రబాబు పొలిటికల్ గేమ్స్

‘అన్నదాత సుఖీభవ’తో చంద్రబాబు పొలిటికల్ గేమ్స్
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త గేమ్ మొదలుపెట్టారు. అన్నదాత సుఖీభవ కింద ఐదు ఎకరాల లోపు రైతులకు తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించిన ఏపీ సర్కారు తొలి దశలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించటం వెనక మతలబు ఏమిటి? ఈ స్కీమ్ కింద తొలి విడత వెయ్యి రూపాయలు నేడో..రేపో ఖాతాల్లో వేయబోతున్నారు. దీని వెనక బలమైన కారణం ఉంది. తొలి విడత చెల్లింపులు మార్చి వరకూ పొడిగిస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కేవలం ఇది ఆన్ గోయింగ్ స్కీమ్ అని చెప్పి ‘ఎన్నికల కోడ్’ పరిధిలో రాకుండా చూసుకోవటం కోసమే ఈ ఎత్తు. అంతే కాదు..మార్చిలో ఎక్కువ మొత్తం ఇస్తే ఎన్నికలకు నెల ముందు కాబట్టి రైతులు ఆ కృతజ్ణతతో తమకు ఎలాగైనా ఓటు వేస్తారనే ఎత్తుగడ. మరి గత అనుభవాలను చూసిన రైతులు చంద్రబాబు ఎత్తుగడలను నమ్ముతారా?. రైతు రుణ మాఫీ విషయంతోపాటు పలు అంశాల్లో రైతులను చంద్రబాబు మోసం చేసిన అంశాన్ని వారు మర్చిపోతారా?. అంటే ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే.

నిజంగా చంద్రబాబుకు రైతులపై అంత ప్రేమ ఉంటే 2014 ఎన్నికల హామీ అయిన రైతు రుణ మాఫీ ఇప్పటివరకూ ఎందుకు అమలు చేయలేదు?. అయిన ఆలశ్యం ఏదో అయింది..ఇది కూడా మార్చి-ఏప్రిల్ నెలల్లో ఎలాగోలా రైతుల ఖాతాలో పడేలా చూస్తే ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చనేది చంద్రబాబు ప్లాన్ గా ఉంది. ఎన్నికల ముందు పెన్షన్లను కూడా అమాంతం పెంచేసిన చంద్రబాబు దీని ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు తొలుత రాష్ట్ర సర్కారు తరపున నాలుగు వేల రూపాయల సాయమే అని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఇఫ్పుడు ఆ మొత్తాన్ని తొమ్మిది వేలకు పెంచారు. ఎందుకంటే రైతులు చంద్రబాబు నమ్మటంలేదనే సంకేతాలు వెలువడటం వల్లే ఈ నిర్ణయంలో ఆకస్మాత్తుగా మార్పులు చేశారని చెబుతున్నారు.

Next Story
Share it