Telugu Gateway
Politics

అమరావతిపై ‘చంద్రబాబు రాజకీయ కుట్ర’ బహిర్గతం!

అమరావతిపై ‘చంద్రబాబు రాజకీయ కుట్ర’ బహిర్గతం!
X

ఎనిమిది నెలల్లో 2.5 లక్షల చదరపు అడుగుల జ్యుడిషియల్ కాంప్లెక్స్ పూర్తి

నాలుగేళ్ళలో రాజధాని శాశ్వత భవనాలు పూర్తి కావా?

రాజధాని నిర్మాణంలో ‘ఉద్దేశపూర్వక’ జాప్యమే నిజం

ఎనిమిది నెలల సమయం. 2.5 లక్షల చదరపు అడుగులు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి. రెండేళ్ళ పాటు పట్టే పనిని ‘రికార్డు’ సమయంలో ఎనిమిది నెలల్లో పూర్తి చేశామని సీఆర్ డీఏ క్లెయిం చేసుకుంటోంది. ఓకే. అదే నిజం అనుకుందాం. మరి మూడున్నర సంవత్సరాలు అంటే ఏకంగా 42 నెలల పాటు సమయం ఉన్నా రాజదానిలో శాశ్వత నిర్మాణాలు ఎందుకు పూర్తి చేయలేదు. కనీసం సగం వరకూ అయినా పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ను చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. దీన్ని బట్టే ‘అమరావతి’పై చంద్రబాబు రాజకీయ కుట్ర బహిర్గతం అయిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా రాజధాని భవనాలు కట్టలేదా?. వచ్చే ఎన్నికలకు దీన్ని ఓ బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని టీడీపీ భావిస్తోందా?. అంటే ఔననే చెబుతున్నాయి ఆ పార్టీ వర్గాలు కూడా . టీడీపీ అధికారంలోకి వచ్చి..కొత్త రాజదాని ప్రాంతాన్ని ఖరారు చేసిన తర్వాత అనుకున్న ప్రణాళిక...ఆ తర్వాత ప్లాన్ పూర్తిగా మారిపోయాయి.

తొలుత వాటర్ ఫ్రంట్ ఓ రెండు..మూడు అద్భుతమైన టవర్లు కట్టి వాటిని చూపించి ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేశారు. కానీ అవి కడితే చెప్పుకోవటానికి ఏమీ ఉండదనే కారణంతో ‘ఉద్దేశపూర్వకం’నే రాజధాని భవనాల నిర్మాణాన్ని జాప్యం చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘పట్టిసీమ’ను రికార్డు సమయంలో కట్టాం. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీని కూడా టార్గెట్ పెట్టి పూర్తి చేశాం. పోలవరంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాం. ‘గిన్నిస్ రికార్డు’ కు ఎక్కాం అని చెబుతారు. అన్ని ‘రికార్డులు’ సృష్టించిన చంద్రబాబునాయుడు ఒక్క రాజధాని శాశ్వత భవనాల దగ్గర మాత్రం ఎందుకు ‘రికార్డు’లను వదిలేసుకున్నారు.

అంతా రాజకీయ మహిమ. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాకపోతే రాజధాని వేరే ప్రాంతానికి వెళ్లిపోతుందని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం ద్వారా రాజకీయ లబ్దిపొందాలి. కడితే ఆ ఛాన్స్ ఉండదు. రాజధానిని టార్గెట్ చేసుకుని అయినా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనేది టీడీపీ ప్లాన్. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందే. ఇప్పటికీ కొంత మంది నేతలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజధాని వేరే ప్రాంతానికి తరలిపోతుందని ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. దీని వెనక ఉద్దేశం కేవలం ఆ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవటమే అన్న స్కీమ్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it