Telugu Gateway
Politics

వర్మ సినిమాపై చంద్రబాబులో టెన్షన్!

వర్మ సినిమాపై చంద్రబాబులో టెన్షన్!
X

ఏపీలో ఎన్నికల వేడితో పాటు రాజకీయ బయోపిక్ ల హీట్ కూడా పెరిగింది. ఓ వైపు ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కధానాయకుడు విడుదల కాగా..మహానాయకుడు శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరో వైపు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో మరో సినిమా తీస్తున్నారు. ఇందులో దివంగత ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం ఎలా దక్కించుకున్నారనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బాలకృష్ణ సినిమాలు మాత్రం ఈ కోణాన్ని ‘టచ్’ చేయకుండానే శుభం కార్డు వేయనున్నాయని టాక్. దీంతో ఇఫ్పుడు అందరి దృష్టి వర్మ సినిమాపైనే ఉంది.

అందుకే ఈ సినిమాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా టెన్షన్ లో ఉన్నట్లు కన్పిస్తున్నారు. ఎందుకంటే గురువారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ఈ ఎన్నికల్లో కొత్త తరం ఓటర్లే ఎక్కువ. ఎన్టీఆర్ గురించి వారికి తెలియజెప్పాలి. తెలుగుజాతి చరిత్ర, ఎన్టీఆర్ చరిత్రపై అవగాహన పెంచాలి. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు. కుట్రదారుల దుష్ప్రచారాన్నితిప్పికొట్టాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలి. అందుకే ‘మహా నాయకుడు, కథానాయకుడు’ సిన్మాలు ఎన్టీఆర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. వక్రీకరించే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారు.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it