Telugu Gateway
Politics

వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్

వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్
X

తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి..ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలసి..వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో అవినీతి, బంధుప్రీతి పెరిగాయని ఆరోపించారు. ఓ ఎమ్మెల్యే అవినీతి విషయంలో విచారణకు ఆదేశించటం వల్లే ప్రధాని మోడీ-చంద్రబాబుకు మధ్య విభేదాలు వచ్చాయి తప్ప...మరో కారణం కాదని అన్నారు. చంద్రబాబునాయుడి అవినీతే ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం అని పేర్కొన్నారు. ఏపీలో అవినీతి అడ్డగోలుగా సాగుతుందని..ఈ విషయం కేంద్రానికి తెలియటం వల్లే చాలా వరకూ సహకారం ఆగిపోయిందని వెల్లడించారు.

ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు మనం కూడా చేద్దామని చెప్పానని..అయితే అందుకు చంద్రబాబు అంగీకరించలేదన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టిందే చంద్రబాబు అని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీల ఫిరాయింపు గురించి చంద్రబాబు మాట్లాడితే నవ్వుతారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉండి 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకుని..అందులో నలుగురికి మంత్రి పదవులు ఇఛ్చింది ఎవరు అని ప్రశ్నించారు.

Next Story
Share it