Telugu Gateway
Latest News

జపాన్ పాస్ పోర్టుకు ఫస్ట్ ర్యాంక్..భారత్ కు 79వ ర్యాంకు

జపాన్ పాస్ పోర్టుకు ఫస్ట్ ర్యాంక్..భారత్ కు 79వ ర్యాంకు
X

జపాన్ మరోసారి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుగా జపాన్ పాస్ పోర్టు నిలిచింది. అది ఎలా అంటే ఈ పాస్ పోర్టు ఉంటే చాలు ఏకంగా 190 దేశాల్లోకి వీసా లేకుండా ప్రవేశించవచ్చు. అయితే భారత్ పాస్ పోర్టు ర్యాంక్ 79వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని 61 దేశాల్లో భారత పాస్ పోర్టుతో వీసా లేకుండానే వెళ్ళొచ్చని హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ వెల్లడించింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుగా జపాన్ పాస్ పోర్టు మరోసారి తన మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ప్రతి ఏటా ఈ జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయి. జపాన్ పాస్ పోర్టుకు మొదటి ర్యాంకు వచ్చిందంటే ఆ దేశం అంత సురక్షితం అని నివేదిక వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు ఆథారిటీ (ఐఏటిఏ) అందించిన వివరాలు ఆధారంగా ఈ జాబితా తయారు చేస్తారు.

Next Story
Share it