Telugu Gateway
Cinema

విశాల్ పెళ్లి ఫిక్స్..అఫీషియల్

విశాల్ పెళ్లి ఫిక్స్..అఫీషియల్
X

హీరో విశాల్ పెళ్లి. ఇది మీడియాలో కొన్ని వందల సార్లు వచ్చిన వార్త. కానీ ఎప్పుడూ అది నిజం కాలేదు. కానీ ఇప్పుడు ఇది అఫీషియల్. విశాల్ పెళ్ళి ఖరారు అయింది. ఆ విషయాన్ని స్వయంగా పెళ్లి కూతురే వెల్లడించింది. అంతే కాదు..ఇద్దరూ కలసి ఉన్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు విశాల్ చేసుకోబోయే అమ్మాయి. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అనీషాతో హీరో విశాల్‌ వివాహం జరగనుంది. అనీషా నిర్మాత జీకే రెడ్డి కుమార్తె. విశాల్‌ పెళ్లి చేసుకోబోయే అనీషా ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరిచారు.

అయితే వారందరి కోసం సంక్రాంతి పండగ రోజున తమ వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేశారు అనీషా. విశాల్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అనీషా అర్జున్‌ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు.

Next Story
Share it