Telugu Gateway
Politics

సుదీర్ఘ ‘అమెరికా షట్ డౌన్’ కు విరామం

సుదీర్ఘ ‘అమెరికా షట్ డౌన్’ కు విరామం
X

అమెరికాలో ‘షట్ డౌన్’ ఎత్తేశారు. సుదీర్ఘకాలం సాగిన ఈ షట్ డౌన్ కు తాత్కాలిక విరామం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ షట్ డౌన్ విషయంలో ఓ రికార్డు నెలకొల్పారని చెప్పుకోవచ్చు. దీంతో ఫిబ్రవరి 15 వరకూ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు నిధులు మంజూరు కానున్నాయి. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు అమెరికా-మెక్సికో మధ్య ఓ భారీ గోడను నిర్మించాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. ఈ అంశంపై అధికార రిపబ్లికన్లు, విపక్ష డెమెక్రాట్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో చివరకు పరిస్థితి షట్ డౌన్ వరకూ వెళ్ళింది. తాజాగా పెట్టిన బిల్లులు కూడా తిరస్కరణకు గురికావటంతో ట్రంప్ దిగిరావాల్సి వచ్చింది. ఈ గోడ విషయంలో గత కొంత కాలంగా డొనాల్డ్ ట్రంప్ పట్టువీడటం లేదు.

విపక్ష డెమాక్రాట్లు సైతం అంతే మొండిగా ఉన్నారు. ఈ అనిశ్చితిని తొలగించటానికి రిపబ్లికన్లు..డెమాక్రాట్లు ఓ అంగీకరానికి వచ్చారు. అయితే 5.7 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన గోడ నిర్మాణానికి సంబంధించిన అనిశ్చితి అలాగే కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూలేని రీతిలో నిత్య వార్తల్లో నిలుస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలపై స్థానికులకు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా..అమెరికాలోని పలు కంపెనీలతో పాటు పలువురు వ్యతిరేకిస్తున్నారు. అవసరం అయితే అత్యవసర పరిస్థితిని ప్రకటించి గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ట్రంప్ ప్రకటించారు.

Next Story
Share it