Telugu Gateway
Politics

మరి 2014లో టీడీపీ ఈవీఎంల ‘ట్యాంపరింగ్’తోనే గెలిచిందా?

మరి 2014లో టీడీపీ ఈవీఎంల ‘ట్యాంపరింగ్’తోనే గెలిచిందా?
X

ఓడిపోయిన పార్టీలు గొడవ చేస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. గెలిచిన పార్టీలు కూడా ఈవీఎంల మీద సందేహం వ్యక్తం చేయటంతో అందరికీ కొత్త అనుమానాలు వస్తున్నాయి?. మరి గత ఎన్నికల్లో బిజెపితో కలసి పోటీచేసిన టీడీపీ కూడా ‘ట్యాంపరింగ్’తోనే విజయం సాధించిందా?. ఈ సారి బిజెపి తమకు తోడు లేదు కాబట్టి ఓడిపోతామని భయంతోనే ఈవీఎంలు వద్దు అంటుందా?. ఎవరికైనా ఈ అనుమానాలు రావటం సహజమే. గత ఎన్నికల్లో ఎక్కువ మంది టీడీపీ కంటే వైసీపీనే గెలుస్తుంది అనుకున్నారు. కానీ చంద్రబాబుకు మోడీ, పవన్ కళ్యాణ్ తో పాటు తో పొత్తు,రైతు రుణ మాఫీ హామీ, రాజధాని నిర్మాణం వంటి ఎన్నో అంశాలు కీలకంగా పనిచేశాయి. అందుకే గెలుస్తారనుకున్న వైసీపీ ఓడిపోయింది. టీడీపీ ఏకంగా 103 సీట్లు దక్కించుకుంది. మరి ఈ గెలుపు ఏపీ ప్రజల తీర్పా?. లేక ఈవీఎంల ట్యాంపరింగా?.

ఎందుకు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈవీఎంల ‘ట్యాంపరింగ్’పై అంతగా ఉలిక్కిపడుతున్నారు. చంద్రబాబు ఈవీఎంలపై చేస్తున్న ప్రచారం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఓటమికి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు ఉందని ఓ నేత వ్యాఖ్యానించారు. అదే ఈవీఎంలతో గత ఎన్నికల్లో మంచి విజయాన్ని దక్కించుకుని ఇఫ్పుడు గగ్గోలు పెట్టడం వెనక మతలబు ఏమిటి?. అయితే ఒక్క మాట మాత్రం నిజం. తెలంగాణలో కానివ్వండి..ఏపీలో కానివ్వండి ఎన్నికల సంఘం అధికారులు అర్హులైన లక్షలాది మంది ఓట్లను అడ్డగోలుగా తొలగిస్తున్నా..నిశ్చేస్టులే చూస్తూ ఉండి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని చెప్పొచ్చు. రిఫరీగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్ గతంలో ఎన్నడూలేని రీతిలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ పై అయితే విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఏపీలో అయితే ఏకంగా ఎన్నికలకు మూడు నెలల ముందు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న ఆర్ పీ సిసోడియాపై వేటు వేసి..కొత్త అధికారిని నియమించారు. ఇప్పుడు చంద్రబాబు ఏకంగా ఈవీఎంలు వద్దు..బ్యాలెట్ పేపర్లే ముద్దు అంటూ ఈ అంశాన్ని పార్లమెంట్ లోనూ లేవనెత్తాలని తమ ఎంపీలకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం అయితే అనుమానాలు నివృత్తి చేస్తాం కానీ..ఈవీఎంల నుంచి వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెబుతోంది.

Next Story
Share it