Telugu Gateway
Politics

మోడీకి ‘సుప్రీం షాక్’

మోడీకి ‘సుప్రీం షాక్’
X

ప్రత్యర్ధి పార్టీలకు రాజకీయంగా మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన మోడీకి సుప్రీంకోర్టు ఊహించని ఝలక్ ఇఛ్చింది. సీబీఐ వివాదంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది మోడీ సర్కారుకు ఇరకాట పరిస్థితే. సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆ ఆదేశాలను కూడా కొట్టివేసింది. సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మే కొనసాగుతారని తేల్చిచెప్పింది. దేశంలోని అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐలోని ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని..సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

సీబీఐ డైరక్టర్ పై చర్య తీసుకుంటే అపాయింట్ మెంట్ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సెలక్షన్ ప్యానల్ వారం రోజుల్లో సమావేశం అయి వర్మపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అదే సమయంలో వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అదే సమయంలో వర్మ కీలకమైన విధాన నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదని కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేష్ ఆస్థానాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరి పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Next Story
Share it