Telugu Gateway
Cinema

కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎఫ్2

కలెక్షన్ల దుమ్మురేపుతున్న ఎఫ్2
X

పెద్ద పెద్ద సినిమాలు అన్న వాటిని కూడా అలవోకగా అలా వెనక్కి నెట్టేసి బాక్సాఫీస్ వద్ద ఎఫ్ 2 సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సంక్రాంతి బరిలో అంచనాలు ఏమీ లేకుండా ఎంట్రీ ఇఛ్చిన ఈ సినిమా ఎవరూ సాధించని ‘రికార్డు’ కలెక్షన్లు సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు తొలిసారి నటించిన మల్లీస్టారర్ సినిమా మంచి విజయాన్ని అందిపుచ్చుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహరీన్ నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సినిమాల్లో ఏకాభిప్రాయంతో ఓటు వేస్తున్న సినిమా ఎఫ్ 2నే.

దీంతో ఈ సినిమాలు వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావటంతో ఎఫ్‌ 2కు కలెక్షన్స్‌ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 32 కోట్లకు పైగా షేర్‌ సాదించినట్టుగా తెలుస్తోంది. ఈ వారం సినిమా రిలీజ్‌ లేవి లేకపోవటం కూడా ఎఫ్‌ 2కు కలిసొచ్చే అంశంమే. ఈ సినిమా ఫుల్‌ రన్‌లో 50 కోట్లకుపైగా షేర్‌ సాధించటం కాయంగా కనిపిస్తోంది. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు.

Next Story
Share it