Telugu Gateway
Cinema

హీరోలపై వర్మ సంచలన వ్యాఖ్యలు

హీరోలపై వర్మ సంచలన వ్యాఖ్యలు
X

యాక్షన్ హీరోలపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ‘మణికర్ణిక’ సినిమా చూసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలాగానే ట్విట్టర్ ద్వారానే ఆయన తనదైన శైలిలో హీరోలపై విమర్శలు చేశారు. . ‘‘మణికర్ణిక సినిమాలో ఓ గ్రేట్ హీరో రూపంలో కంగనా రనౌత్ కనిపించింది. చిత్రంలో కంగనా చూపిన ఉగ్రరూపం, ధీరత్వం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆమె నటనతో పోల్చిచూస్తే.. యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’’ అని పేర్కొన్నారు వర్మ. మణికర్ణిక సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాలో కంగనా యాక్షన్ పై కూడా అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆమె ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారని చెబుతున్నారు. తొలుత ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కొంత భాగం పూర్తయిన తర్వాత ఆయన బయటకు వచ్చేస బాలకృష్ణ నటించి..నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం కథనాయకుడికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన మణికర్ణిక సినిమాలో కంగనా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హిట్ టాక్‌తో ఈ సినిమా దూసుకెళుతోంది.

Next Story
Share it