Telugu Gateway
Cinema

ప్రియావారియర్ సంచలన వ్యాఖ్యలు

ప్రియావారియర్ సంచలన వ్యాఖ్యలు
X

ఈ పేరుకు ప్రస్తుతం పరిచయం అక్కర్లేదు. ఒక్క కన్నుగీటుతో దేశంలో లక్షలాది మంది హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ ప్రియా. ఆమెకు ఏది అయితే క్రేజ్ తెచ్చిపెడుతుందో ఇప్పుడు అదే ఆమెకు చికాకు పుట్టిస్తోందిట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ఎక్కడికి వెళ్లినా మాట్లాడేది కన్ను గీటమంటున్నారట ఈ కుర్ర హీరోయిన్ ని. కానీ ఆ పని చేసి చేసి మరీ బోరింగ్ మారిందని..ఇప్పటివరకూ తాను అలా 200 సార్లు కన్ను గొట్టాల్సి వచ్చిందని లెక్కలతో సహా చెబుతోంది. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు అడార్ లవ్’ సినిమా ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తనకు వచ్చిన క్రేజ్ కారణంగా ప్రైవసీని కోల్పోవలసి వచ్చిందని వాపోతోంది ఈ భామ.

పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు కొన్ని భరించకతప్పదు అని వ్యాఖ్యానించింది. తెలుగులో ప్రియా నానితో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి ధృవీకరణం లేదు. తనకు విజయ్ సేతుపతి, దర్శకుడు అట్లీతో కలసి సినిమాలు చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో ప్రియా వెల్లడించింది. ఆమెకు గత కొంత కాలంగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. అయినా సరే ఆచితూచి వ్యవహారిస్తోంది ఈ హీరోయిన్.

Next Story
Share it