Telugu Gateway
Cinema

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్
X

కీర్తి సురేష్. పరిశ్రమలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఏ హీరోయిన్ కు రానంత గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ‘మహానటి’ సినిమా అయితే ఆమె కెరీర్ లోనే లైఫ్ టైమ్ సినిమాగా మిగలనుంది. బయోపిక్ లోనే కాకుండా..ఇతర చిత్రాల్లోనూ తన అభినయంతో కీర్తి సురేష్ తనకంటూ ఓ ప్రత్యేక ఆదరణ పొందుతోంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా కీర్తి సురేష్ అప్రతిహత విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఆమె వరస పెట్టి అక్కడ కూడా హిట్లు కొడుతోంది.

అసలు ఏ మాత్రం ఊహించని రీతిలో తాను సినీ రంగంలోకి ప్రవేశించానని..ఇప్పుడు ఈ రంగంలో పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం అసలు తనకు పెళ్లి గురించి ఆలోచించే సమయంలేదని పేర్కొన్నారు. చేతిలో చేయాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేయాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు.

Next Story
Share it