Telugu Gateway
Politics

మోడీ ‘దూకుడు’!

మోడీ ‘దూకుడు’!
X

ప్రధాని నరేంద్రమోడీ దూకుడు ముందు కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతుందా?. అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఎవరూ ఊహించని రీతిలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించటం ద్వారా మోడీ మిగిలిన పార్టీలను ఆత్మరక్షణలో పడేశారు. మోడీ మాస్టర్ స్ట్రోక్ తో మిగిలిన పక్షాలు అన్నీ విధిలేని పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాల్సి వచ్చింది. అంతే కాదు రికార్డు సమయంలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఎన్నడూలేనంత స్పీడ్ లో పార్లమెంట్ ఆమోదం పొందింది. అంతే కాదు..ఏకంగా రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లుకు తుది నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈ స్ట్రోక్ నుంచి విపక్షాలు కోలుకోలేక ముందే ఇప్పుడు మరో అస్త్రంగా మోడీ సిద్ధం అయినట్లు కన్పిస్తోంది. మరి ఈ నిర్ణయంతో పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మరో భారీ ఆలోచన చేస్తున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి రూ 5 లక్షలకు పెంచేందుకు మోడీ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు వల్ల దెబ్బతిన్న ఈ వర్గాలకు ఈ ఉపశమనం కలగజేస్తేనే ఎన్నికల్లో వారి నుంచి ప్రతికూలత రాకుండా తట్టుకోగలమని అభిప్రాయపడుతోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టబోయే ఓటాన్‌ అకౌంట్లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదన వెలువడుతుందని చెబుతున్నారు. ఐటీ పరిమితి పెంపుతో పాటు మెడికల్‌ బిల్లులు, ట్రాన్స్‌ పోర్టు అలవెన్సు, విద్యాఫీజులు.. మొదలైనవి పన్ను మినహాయింపు జాబితాలో యథాతథంగా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Next Story
Share it