Telugu Gateway
Cinema

రెచ్చిపోయిన లక్ష్మీరాయ్

రెచ్చిపోయిన  లక్ష్మీరాయ్
X

అందానికి అందం..అభినయానికి అభియనం ఉన్నా..ఎందుకో రాయ్ లక్ష్మీకి కాలం కలసి రాలేదు. పేరు మార్చుకున్న పెద్దగా ఫలితం లేకుండా పోయింది. అడపాదడపా సినిమాల్లో కన్పించటం తప్ప..పూర్తి స్థాయి హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. టాలీవుడ్ లో అయితే ‘ప్రత్యేక పాట’ల్లో మెరుస్తూ ఉంది. రాయ్ లక్ష్మీ మరోసారి రెచ్చిపోయింది. ఆమె నటించిన ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ సినిమాకు సంబంధించి ‘పాపా నీకేది ఇష్టం’ అంటూ ఓ పాటను విడుదల చేశారు.

ఈ పాటలో లక్ష్మీరాయ్ దుమ్మురేపనున్నట్లు కన్పిస్తోంది. రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా లక్ష్మీరాయ్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాకు కిశోర్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ కానుంది.

https://www.youtube.com/watch?v=9rT_t7k6HHU

Next Story
Share it