Telugu Gateway
Politics

స‌ర్కారుపై కె ఈ కృష్ణమూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

స‌ర్కారుపై కె ఈ కృష్ణమూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన ఉప ముఖ్య‌మంత్రి కె ఈ కృష్ణమూర్తి స‌ర్కారుపైనే తీవ్ర‌మైన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో కొంత మంది అధికారులు ప్ర‌భుత్వాన్నిశాసిస్త‌న్నార‌ని పేర్కొన్నారు. అలాంటి వారిని దారికి తేవ‌టంలో ప్ర‌భుత్వం కొన్ని ఒత్తిళ్ళ‌కు లోను అవుతోంద‌ని ఆరోపించారు. అదే స‌మ‌యంలో శ్రీశైలం దేవ‌స్థానం బోర్డు నియామ‌కానికి సంబంధించి సీఎంకు ఫైలు పంపి మూడు నెల‌లు అయినా సీఎం ఇంత వ‌ర‌కూ నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. ట్ర‌స్ట్ బోర్డు నియామ‌కంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించామ‌ని తెలిపారు.

పెద్ద ఆల‌యాల‌కు బోర్డులు వేయ‌క‌పోతే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన రెవెన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖే కష్టంగా మారిందన్నారు. ఒక్కోసారి దేవాదాయశాఖను వదులుకోవాలనిపిస్తోందని తెలిపారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ‌రావ‌తిలో కొత్త‌గా నిర్మించ‌నున్న టీటీడీ దేవాల‌యానికి సంబంధించి సంబంధిత మంత్రి అయిన కెఈకి టీటీడీ అధికారులు క‌నీసం ఆహ్వానం కూడా పంప‌లేదు. ఈ వ్య‌వ‌హారంపై ఆయ‌న సీరియ‌స్ అయిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it