Telugu Gateway
Top Stories

గోవా బీచ్ ల్లో మందు బ్యాన్

గోవా బీచ్ ల్లో మందు బ్యాన్
X

భారత్ లో పర్యాటకుల స్వర్గథామం గోవా. ముఖ్యంగా యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఏటా లక్షల సంఖ్యలో గోవా వెళతారు. ఎంజాయ్ చేస్తారు. గోవాలో మందు మంచి నీళ్లలా ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. కిరాణా దుకాణాల్లో మందు అమ్ముతారు. గోవాలో బీచచ్ లు కూడా అంతే. ఎటువైపు వెళ్ళినా బీచ్ లే బీచ్ లు. చాలా మంది యువకులు చల్లటి బీర్లు తీసుకుని అలా బీచ్ ల వెంట తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే గోవా ప్రభుత్వం బీచ్ ల్లో మందు తాగటాన్ని నిషేధించనుంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు.

బీచ్ లు మరింత కలుషితం కాకుండా ఉంచటంతో పాటు ప్రమాదాల నివారణకు గోవా సర్కారు ఈ చర్యలు చేపట్టింది. కాదు కూడదని ఎవరైనా ఈ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే 2 వేల రూపాయల జరిమానా లేక మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలోనే చట్టంలో మార్పులు చేయనున్నారు. బీచ్‌లో మద్యం తాగినా, బహిరంగంగా వంట చేసినా రెండువేల రూపాయలు జరిమానా విధించాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతే కాదు పర్యాటక చట్టంలోనూ మార్పులు తెస్తున్నారు.

Next Story
Share it