Telugu Gateway
Latest News

‘ఐస్’ అమెరికా..అత్యయిక పరిస్థితి

‘ఐస్’ అమెరికా..అత్యయిక పరిస్థితి
X

అగ్రరాజ్యం అమెరికాలో అత్యయిక పరిస్థితి ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ప్రజలు అసలు ఇంట్లో నుంచి అడుగు పెట్టే పరిస్థితి లేదు. యూనివర్శిటీలకు సెలవులు ప్రకటించారు. ఎందుకంటే అసాధారణ స్థాయిలో ఉష్ణ్రోగతలు పడిపోయి..అమెరికా ‘ఐస్ అమెరికా’గా మారిపోయింది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ 53 డిగ్రీలకు పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ దెబ్బకు రహదారులు కన్పించకుండా పోయాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ చలి దెబ్బకు రెండువేలకు పైగా విమానాలు రద్దు అయ్యాయి. పలు చోట్ల సరస్సులు కూడా గడ్డకట్టిపోయాయి. ఈ చలి ప్రభావం ప్రధానంగా షికాగో, విస్కాన్సిస్, మిషిగాన్, ఇలినాయిస్, డెట్రాయిట్ తదితర ప్రాంతాల్లో ఉంది.

ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేట్ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు. ఎందుకంటే ఎవరూ అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదక్కడ. ఉత్తర డకోటా, దక్షిణ డకోటా మొదలుకొని ఓహియో దాకా (1,930 కిలోమీటర్ల పొడవునా) డజనుకుపైగా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో ఎన్నడూలేనంతటి కనిష్టస్థాయిలకు పడిపోయాయి. కొన్ని రైళ్ల సర్వీసులనైనా నడిపేందుకు వీలుగా, మంచును కరిగించేందుకు షికాగోలో రైళ్ల పట్టాల దగ్గర సిబ్బంది మంటలు అంటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఆర్కిటిక్‌ చలి దెబ్బకు అమెరికాలో లక్షలాది ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

Next Story
Share it