Telugu Gateway
Politics

మోడీకి చంద్రబాబు ఘాటు లేఖ

మోడీకి చంద్రబాబు ఘాటు లేఖ
X

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విమానాశ్రయంలో దాడి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. కేంద్రం ఇప్పటికే ఈ కేసును జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది రాష్ట్రాల హక్కుల్లోకి కేంద్రం జొరబడటమే అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై శనివారం నాడు చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీకి సుదీర్ఘమైన లేఖ రాశారు. జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించటం సమాఖ్య స్పూర్తికి విరుద్దమని అన్నారు.

జగన్‌పై దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు సరికాదని పేర్కొన్నారు. 2008లో ఎన్‌ఐఏ చట్టాన్ని మోదీ వ్యతిరేకించిన విషయాన్ని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఇప్పుడదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్‌పై దాడి కేసును ఆ సంస్థకు అప్పగించారన్నారు. ఎన్‌ఐఏ చట్టంపై మోడీ ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని ఆయన ఆరోపించారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులను మాత్రమే జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని చంద్రబాబు సూచించారు. వ్యక్తిగత దాడి కేసును కూడా ఎన్‌ఐఏకు అప్పగించడం సరికాదని అన్నారు.

Next Story
Share it