Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు మోడీ సర్కార్ షాక్

చంద్రబాబుకు మోడీ సర్కార్ షాక్
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి మోడీ సర్కార్ షాక్ ఇఛ్చింది. చంద్రబాబు అండ్ టీమ్ సర్కారు ప్రాయోజిత ‘దావోస్’ సదస్సుపై ఆంక్షలు విధించింది. ప్రతి ఏటా కోట్లాది రూపాయల వ్యయం చేస్తూ భారీ బృందాలతో దావోస్ వెళ్ళటం..రావటం తప్ప ఈ సదస్సుల ద్వారా ఏపీకి ఒరింగింది ఏమీ లేదు. గత రెండు సంవత్సరాల్లో చంద్రబాబు అవే కంపెనీలతో పదే పదే చర్చలు...ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ప్రకటించటం ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో చేసుకున్న ఒప్పందాలు ఏవీ కూడా అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. దీనికి తోడు ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) ద్వారా వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) నిర్వహించే కార్యక్రమాల సమావేవాల ఆహ్వానాలను కొనుగోలు చేయటం..తమకు ఎవరికీ రాని రీతిలో ఈ ప్రపంచ సదస్సులకు ఆహ్వానం వచ్చిందని ప్రచారం చేసుకోవటం ఏపీ సర్కారుకు పరిపాటి అయింది.

అయితే ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకుంటున్న ఆహ్వానాలు అని ప్రభుత్వ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. మరో సారి దావోస్ పేరుతో చంద్రబాబు తలపెట్టిన హంగామాకు కేంద్రం బ్రేకులు వేసింది. ప్రతి ఏడాది దావోస్ సమావేశాలకు చంద్రబాబు 14-15మంది ప్రతినిధులతో దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వెళతారు. ఈ ఏడాది ఏడు రోజుల పర్యటనను 4రోజులకు కుదించుకోవాలని కేంద్రం సూచించింది. 15మందికి బదులు ఐదుగురే వెళ్లాలని ఆంక్షలు విధించింది. దీంతో ఈనెల 20 నుంచి 26వ తేదీవరకు దావోస్‌ వెళ్లేందుకు సీఎం కార్యాలయం కేంద్రం అనుమతి కోరింది. కేంద్రం ఆంక్షలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ అనుమతి కోరాలని సీఎంవో అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం. మరి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా? లేదా వేచిచూడాల్సిందే.

Next Story
Share it