Telugu Gateway
Top Stories

భానుప్రియపై కేసు..కొత్త ట్విస్టు

భానుప్రియపై కేసు..కొత్త ట్విస్టు
X

ఒకప్పటి టాప్ హీరోయిన్, ప్రస్తుత నటి భానుప్రియపై ఆంధ్రప్రదేశ్ లోని సామర్లకోట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ వ్యవహారం పెద్ద కలకలం రేపింది. భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో నిర్భందించి వేధిస్తున్నారని చెబుతూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమార్తె సంధ్యను చెన్నైలోని భానుప్రియ నివాసంలో పనికి పెట్టగా.. భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తొలుత తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడించేవారిని.. కానీ ఏడాది కాలంగా తన కుమార్తెతో ఫోన్‌లో కూడా మాట్లాడించడం లేదని పేర్కొన్నారు.

ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ వ్యవహారంపై భానుప్రియ స్పందించారు. తమ ఇంట్లో పనిచేస్తున్న బాలిక విలువైన వస్తువులు దొంగిలించుకుపోయిందని..వీటిని వెనక్కి ఇవ్వాలని అడిగితే బాలిక తల్లి కేసు పెట్టిందని భాను ప్రియ తెలిపారు చివరకు భానుప్రియ ఇంట్లో పనిచేస్తున్న బాలిక కూడా తనకు ఇంట్లో ఎలాంటి ఇబ్బందిలేదని..దొంగిలించిన వస్తువులను వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపింది. దీంతో ఈ కేసు ఎన్నిక మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it