Telugu Gateway
Politics

అనిల్ అంబానీ పేరు కూడా చెప్పకూడదా?

అనిల్ అంబానీ పేరు కూడా చెప్పకూడదా?
X

లోక్ సభలో అనిల్ అంబానీ పేరు కూడా చెప్పకూడదా?. ఆయన పేరు బదులు ఏ అంటే ఓకేనా?. డబుల్ ఏఏ అని చెప్పొచ్చా? అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి రాఫెల్ డీల్ ఎలా అప్పగిస్తారంటూ ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ సభలో ఆయన పేరు ప్రస్తావించారు. దీంతో సభలో లేని వ్యక్తులు పేర్లు చెప్పకూడదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేమైనా కొత్త నిబంధనా? అని ప్రశ్నించారు. ప్రపంచలోనే అత్యంత విలువైన ఒప్పందాన్ని ఏ మాత్రం లేని సంస్థకు అప్పగించి..దేశ సంపద కొల్లగొట్టి అనిల్ అంబానీ జేబులో వేశారని ఆరోపించారు.

రఫెల్ డీల్ కు సంబంధించిన రహస్య ఫైళ్ళు అన్నీ తన పడకగదిలో ఉన్నాయని మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం పారికర్ ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రానా ఫోన్లో చెప్పినట్లుగా ఉన్న ఆడియో టేపును కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ టేపును పార్లమెంట్ లో విన్పించాలని కాంగ్రెస్ పట్టుపట్టగా..అందుకు స్పీకర్ నిరాకరించారు. ఈ అంశంపై సభలో కొద్ది సేపు దుమారం కొనసాగింది. ఆడియో టేపును వినటానికి బిజెపి భయపడుతంది కనుక తాను విన్పించను అని వ్యాఖ్యానించారు. అయితే గోవా సీఎం మనోహర్ పారికర్ ఈ టేపుల అంశాన్ని ఖండించారు. ఇది పూర్తిగా బోగస్ వ్యవహారం అని ఆరోపించారు. ఏ దారి లేకే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాటితో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

Next Story
Share it