Telugu Gateway
Cinema

రాజకీయాల్లోకి ‘ప్రకాష్ రాజ్’

రాజకీయాల్లోకి ‘ప్రకాష్ రాజ్’
X

ఇంత కాలం రాజకీయాలపై పరోక్షంగా స్పందిస్తూ వచ్చిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు నేరుగా రాజకీయ రణరంగంలోకి దూకనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలో నిలపనున్నట్లు వెల్లడించారు. అది కూడా స్వతంత్రంగా పోటీ చేస్తామని..త్వరలోనే నియోజకవర్గాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అయితే గత తెలంగాణ ఎన్నికల ముందు ప్రకాష్ రాజ్ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి తెలంగాణలో ఏమి పని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో వివాదస్పదంగా మారాయి. ప్రకాష్ రాజ్ గత కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడను కెసీఆర్ బెంగుళూరులో కలసిన సమయంలోనూ ప్రకాష్ రాజ్ తోడు వెళ్ళిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కెసీఆర్ సహకరిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it