‘పేట ’ ట్రైలర్ లో అదగొట్టిన రజనీకాంత్
రజనీకాంత్ మరోసారి తనదైన డిఫరెంట్ స్టైల్ చూపెట్టారు. పేట ట్రైలర్ లో అదే కన్పించింది. తన స్టైల్ పై తానే కామెంట్ చేసుకుంటూ ఓ డైలాగ్ ఉంది అందులో. ‘చూడ్డానికి చిన్నపిల్లాడిలా చాలా స్టైల్‌గా ఉన్నారంటూ’ మేఘా ఆకాశ్ కాంప్లిమెంట్ ఇవ్వగా... ‘స్టైల్‌గా ఉన్నానట నాచురల్లీ’ అంటూ రజనీ తన మార్కు డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పెట్టా’. త్రిష, సిమ్రాన్, విజయ్‌సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని... ‘పేట’ పేరుతో నిర్మాత వల్లభనేని అశోక్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఇటీవలే తమిళ ‘పేట్టా’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో రజనీ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా కాలేజీ వార్డన్‌గా స్టైలిష్ లుక్‌లో మెరిసిన తలైవా... యాక్షన్ సీన్స్ లో ఫుల్ టూ మాస్ డైలాగ్స్ తో అదరగొట్టారు. మరి ఈ సినిమా తెలుగులో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=rVWyXqgxG14