Telugu Gateway
Cinema

‘కల్కి’’ మోస్టర్ పోస్టర్

‘కల్కి’’ మోస్టర్ పోస్టర్
X

సుదీర్ఘ విరామం తర్వాత రాజశేఖర్ హీరోగా సినిమా వస్తోంది. అదే కల్కి. గరుడవేగ సినిమాతో చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ చేస్తున్న సినిమా ఇదే. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అందులో రాజశేఖర్ ఎంతో స్టైలిష్ గా కన్పించారు.

1983 నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతాన్ని అందించగా.. ఆదా శర్మా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్‌ బ్యానర్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌ నిర్మాతలు.

https://www.youtube.com/watch?v=h8hLDfEa99E

Next Story
Share it